ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మొదటి రోజే రూ.294 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసింది. కాగా, అంతకుముందు ఇండియాలో ఇప్పటివరకు మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘RRR’ రూ.233 కోట్ల గ్రాస్‌తో మొదటి స్థానంలో ఉంది. తాజాగా ఆ రికార్డును పుష్ప-2 బద్దలుకొట్టింది.