Kalki 2898: ప్రభాస్- నాగ్ అశ్విన్‌ల మూవీ కల్కీ 2898కి (Kalki 2898) సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దీషా పఠానీ, పశుపతి నటిస్తున్నారు. వీరితో దుల్కర్ సల్మాన్ జత కలవనున్నాడు. కల్కీ మూవీలో భాగస్వామిని అవుతున్నానని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశాడు. దుల్కర్ రాకతో కల్కీ మూవీపై మరింత హైప్ వచ్చింది. ఆయన రోల్‌పై మాత్రం సస్పెన్స్ నెలకొంది.
కల్కీ (Kalki 2898) మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతేంది. మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. విష్ణుమూర్తి ఒక్కో యుగానికి ఒక అవతారం ఎత్తి.. శత్రు సంహారం చేస్తుంటారు. కలియుగంలో కల్కీ అవతారం ఎత్తుతారు. మానవులు విపరీత ధోరణులకు అలవాటు పడి, భూమిపై పాపాలు పెరిగిన సమయంలో విష్ణుమూర్తి కల్కీ అవతారంలో జన్మిస్తారు. శంభల అనే గ్రామంలో విష్ణుయశస్సు అనే బ్రాహ్మనుడి ఇంట్లో కల్కీ జన్మిస్తాడట. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని కొందరు చెబుతున్నారు. దోషాన్ని హరించే అవతారం కనుక కల్కీ అవతారం అనే పేరు వచ్చింది. కలియుగంలో పాపభారం పెరిగిపోతుంది. కలియుగంలో కల్కీగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని విష్ణువు చెప్పినట్టు పురాణాల్లో ఉంది.
కల్కీ (Kalki 2898) జన్మించే శంభగల గ్రామం గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఊరు గురించి తెలుసుకోవడానికి చాలామంది ట్రై చేశారు. గ్రామం పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తోందని కొందరు అంటారు. హిమాలయాల్లో శంభల గ్రామం ఉండొచ్చని కొందరు అంటున్నారు. కల్కీ గురించి మూవీ తీస్తోండటంతో.. హైప్ నెలకొంది.