ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి కిరికిరి మొదలైంది అంటూ.. సాలిడ్ అప్టేట్ ఇచ్చారు మేకర్స్.
Double Ismart: Double Ismart.. Kirikiri has started!
Double Ismart: ఎట్టకేలకు డబుల్ ఇస్మార్ట్ కిరికిరి పంచాయితీ మొదలైంది. ఈ మధ్య షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన రామ్, పూరి.. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న రామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్టుగా బజ్ ఉంది.
ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ.. డబుల్ ఇస్మార్ట్ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు. దిమాక్ కిరికిరి అవుతుంది.. ఏదో వచ్చేలానే ఉంది.. అంటూ అప్డేట్ పై కన్ఫర్మేషన్ ఇచ్చేసారు. పోస్టర్లో రామ్ లుక్ అదిరిపోయింది. అయితే.. ఈ సినిమా నుంచి టీజర్ వస్తుందా? లేదా ఫస్ట్ సాంగ్ వస్తుందా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ సాలిడ్ ట్రీట్ మాత్రం రామ్ బర్త్ డే సందర్భంగా మే 15న ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు పూరి. ఏదైనా.. సరే డబుల్ ఇస్మార్ట్ నుంచి వచ్చే టీజర్ లేదా సాంగ్ పైనే అందరి దృష్టి ఉంది.
లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో.. అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరో హిట్ అందుకోలేదు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాణం వహిస్తుండగా.. పాన్ ఇండియా లెవల్లో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో పూరి, రామ్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.