Rana naidu web series కలిసి చూడొద్దు.. ఎందుకో చెప్పిన రానా, వెంకీ
Rana naidu web series:రానా నాయుడు (Rana naidu) వెబ్ సిరీస్ మరో రెండు రోజుల్లో నెట్ ప్లిక్స్లో (net flix) స్ట్రీమింగ్ అవనుంది. ఇందులో బాబాయ్- అబ్బాయ్.. తండ్రి కొడుకులుగా నటించారు. వెబ్ సిరీస్ కుటుంబం అంతా కలిసి చూడొద్దు అని వెంకటేశ్ (venkatesh) ఇప్పటికే కోరారు. ఇప్పుడు రానా (rana) అదే విషయం చెబుతున్నారు.
Rana naidu web series:రానా నాయుడు (Rana naidu) వెబ్ సిరీస్ మరో రెండు రోజుల్లో నెట్ ప్లిక్స్లో (net flix) స్ట్రీమింగ్ అవనుంది. ఇందులో బాబాయ్- అబ్బాయ్.. తండ్రి కొడుకులుగా నటించారు. వెబ్ సిరీస్ కుటుంబం అంతా కలిసి చూడొద్దు అని వెంకటేశ్ (venkatesh) ఇప్పటికే కోరారు. ఇప్పుడు రానా (rana) అదే విషయం చెబుతున్నారు. సిరీస్‌లో డైలాగ్స్ పరంగా అభ్యంతరకర డైలాగ్స్ ఉంటాయని.. కథపరంగా తప్పలేదన్నారు. అందుకే ఒంటరిగా చూడాలని పేర్కొన్నారు. వెబ్ సిరీస్ డార్క్ ఫ్యామిలీ కథ అని రానా తెలిపారు. ప్రైవేట్ సెటిల్ మెంట్లను కార్పొరేట్ స్థాయిలో చేసే పాత్ర తనదని వివరించారు. సినిమాగా చెప్పలేని కథ అని.. అందుకే వెబ్ సిరీస్ తీశామని తెలిపారు.
‘రానా నాయుడు’ (rana naidu) వెబ్ సిరీస్ అమెరికన్ డ్రామా ‘రే డోనేవన్’కు రీమేక్ అయినా.. మంచి స్పందన వస్తోంది. వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ డైరెక్ట్ చేశారు. వెబ్‌సిరీస్‌లో నటించేందుకు వెంకటేష్ (venkatesh), రానా (rana) రెమ్యునరేషన్ ఎక్కువే తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినిమా కన్నా డబుల్ చార్జీ (double charge) చేశారని తెలుస్తోంది. రానా నాయుడు’ లో వెంకటేష్ నాగ (naaga) పాత్రలో కనిపించారు. ఇందుకోసం వెంకీ దాదాపుగా రూ.10కోట్లను (10 crores) రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. రానా కూడా రూ.8కోట్ల (8 crores) పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.
వెంకటేష్ (venkatesh) ఒక్కో సినిమాను చేయడానికి ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు తీసుకుంటారు. రానా డేట్స్ కోసం ఐదు కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. వెబ్‌సిరీస్ చేయడానికి మాత్రం ఇద్దరు రెండింతల పారితోషికం తీసుకున్నారు. ‘రానా నాయుడు’ (rana naidu) యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మాఫియా సామ్రాజ్యంలో తండ్రి, కొడుకుల (father and son) మధ్య ఆధిపత్యం గురించి వెబ్ సిరీస్ తీశారు. ఎమోషషనల్, రివెంజ్ డ్రామా అని ట్రైలర్ బట్టి అర్థం అవుతుంది. రానా, వెంకీ కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదీ. వెంకీ, రానా ఫ్యాన్స్.. వెబ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.