»Dont Want See The Rana Naidu Web Series Says Suresh Babu
Rana naidu web series చూడనంటోన్న సురేష్ బాబు
Rana naidu web series:బాబాయ్ అబ్బాయ్ కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana naidu) నిన్నటి నుంచి నెట్ ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉండగా.. మొత్తం న్యూడిటీ ఉంది. వెబ్ సిరీస్ గురించి వెంకటేష్ సోదరుడు, రానా తండ్రి సురేష్ బాబు (suresh babu) స్పందించారు. తాను ఆ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడం లేదని చెప్పేశారు.
don't want see the rana naidu web series says suresh babu
Rana naidu web series:బాబాయ్ అబ్బాయ్ కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana naidu) నిన్నటి నుంచి నెట్ ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉండగా.. మొత్తం న్యూడిటీ ఉంది. అందుకే కాబోలు వెంకటేశ్ (venkatesh), రానా (rana).. ఇద్దరూ కూడా ఒంటరిగా చూడాలని కోరారు. ఈ వెబ్ సిరీస్ గురించి వెంకటేష్ సోదరుడు, రానా తండ్రి సురేష్ బాబు (suresh babu) స్పందించారు. తాను ఆ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడం లేదని చెప్పేశారు.
వెబ్ సిరీస్ చూడను అని సురేష్ బాబు కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు. ఎందుకంటే ఇందులో శృంగారం పాలు ఎక్కువ.. అంతకుమించి బూతులు కూడా ఉన్నాయి. అందుకే సురేష్ బాబు దూరం దూరం అంటున్నారు. వెబ్ సిరీస్ మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అని తెగ హడావిడి చేశారు. చూస్తే.. ఏముంది మొత్తం బోల్డ్ షో. వెంకటేష్ (venkatesh) ఫ్యామిలీ మూవీస్ చేస్తుంటారు. దాదాపు అన్నీ సినిమాలు హిట్టే.. ఆయనేంటీ ఇలాంటి సిరీస్‌లో నటించడం అనే సందేహాం కలుగుతుంది. రానా (rana) కూడా మంచి మూవీస్ సెలక్ట్ చేసుకుంటున్నాడు. రానా నాయుడు మాత్రం అందుకు భిన్నం. ఈ సిరీస్ కోసం ఇద్దరూ రెమ్యునరేషన్ డబుల్ చేశారట. కానీ వారి ఉన్న మంచి పేరు పోయేలా అనిపించింది. వెబ్ సిరీస్ డార్క్ ఫ్యామిలీ కథ అని రానా (rana) ఇంతకుముందే తెలిపారు. ప్రైవేట్ సెటిల్ మెంట్లను కార్పొరేట్ స్థాయిలో చేసే పాత్ర తనదని వివరించారు. సినిమాగా చెప్పలేని కథ అని.. అందుకే వెబ్ సిరీస్ తీశామని తెలిపారు.
అమెరికన్ డ్రామా ‘రే డోనేవన్’కు రీమేక్‌గా తీశారు. వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ డైరెక్ట్ చేశారు. వెబ్‌సిరీస్‌లో నటించేందుకు వెంకటేష్ (venkatesh), రానా (rana) రెమ్యునరేషన్ ఎక్కువే తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినిమా కన్నా డబుల్ చార్జీ (double charge) చేశారని తెలుస్తోంది. రానా నాయుడు’ లో వెంకటేష్ నాగ (naaga) పాత్రలో కనిపించారు. ఇందుకోసం వెంకీ దాదాపుగా రూ.10కోట్లను (10 crores) రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. రానా కూడా రూ.8కోట్ల (8 crores) పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. వెంకటేష్ (venkatesh) ఒక్కో సినిమాను చేయడానికి ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు తీసుకుంటారు. రానా డేట్స్ కోసం ఐదు కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. వెబ్‌సిరీస్ చేయడానికి మాత్రం ఇద్దరు రెండింతల పారితోషికం తీసుకున్నారు.