»Do You Know When The Milky Beauty Tamannaah Will Get Married
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ఎప్పుడో తెలుసా ?
తమన్నా ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో ఇక ఆగలేక.. ముద్దుగుమ్మ పెళ్ళికి ఓకే చెప్పినట్లు సమాచారం. విజయ్ కుటుంబ వర్గాలకు కూడా తమన్నా నచ్చడంతో వీరి పెళ్లి త్వరలోనే జరగనుందని టాక్.
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. హ్యాపీ డేస్ సినిమా వరకు పెద్దగా గుర్తింపు రాని.. ఈ భామకు ఆ తరువాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్ (Tollywood)లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగుతో పాటు తమిళ్.. హిందీ సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంది ఈ చిన్నది. అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడి జోరు కాస్త తగ్గింది. తాజగా లవ్ బర్డ్స్ తమన్నా-విజయ్ వర్మ (Vijay Verma) పెళ్లికి సిద్దమైనట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పట్లో మ్యారేజ్(Marriage) ఆలోచన లేదని మిల్కీ బ్యూటీ గతంలో ప్రకటించారు.
పేరంట్స్ ఒత్తడితో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ఎంగేజ్మెంట్ (Engagement) ఉంటుందని, ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందని సమాచారం. బాలీవుడ్ నటుడు విజయ వర్మ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల బహిరంగంగానే వెల్లడించింది. వీరిద్దరూ ఇప్పటికే చెట్టా, పట్టాలేసుకొని తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ చేతిలో ప్రస్తుతం కొన్ని మూవీస్ ఉండడంతో వాటిని ఫినిష్ చేసి.. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయని సమాచారం.