సిద్దిపేట నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆ డెవలప్ వెనక మంత్రి హరీశ్ రావు కృషి ఉందని.. అతని అభిమానిగా మారిపోయానని తెలిపారు.
Director Rajamouli: ప్రముఖ దర్శకుడు, జక్కన్న రాజమౌళి (Rajamouli) తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై (Harish Rao) ప్రశంసలు కురిపించారు. సిద్దిపేట నియోజకవర్గం చాలా అభివృద్ధి జరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హరీశ్ రావు (Harish Rao) విశేష కృషి ఉందన్నారు. హరీశ్ రావు చొరవ, కృషి గురించి తెలిసి అతని అభిమానిగా మారిపోయానని రాజమౌళి (Rajamouli) తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.
బంజారాహిల్స్లో గల లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావు(Harish Rao) , రాజమౌళి (Rajamouli) హాజరయ్యారు. ఇద్దరు పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. రాజమౌళికి (Rajamouli) మంత్రి హరీశ్ రావు (Harish Rao) శాలువా కప్పి, మెమోంటో అందజేసి సత్కరించారు. బాహుబలితో తెలుగు సినిమాను దేశవ్యాప్తం చేశారని రాజమౌళిని (Rajamouli) మంత్రి హరీశ్ రావు (Harish Rao)ప్రశంసించారు. బాహుబలి సిరీస్ ఘన విజయాలు నమోదు చేసిందని గుర్తుచేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో అదీ విశ్వవ్యాప్తం అయ్యిందని తెలిపారు. ఆ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజమౌళి భవిష్యత్లో మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరారు.