ఇప్పటికే రంగమార్తాండ(Rangamaarthanda) సినిమా ప్రచార కార్యక్రమాలను మూవీ మేకర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం మూవీ టీజర్ ను విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి(Krishnavamsi) వాయిస్ తో ఈ టీజర్ మొదలవ్వగా ప్రకాష్ రాజ్ ను సన్మానిస్తున్నట్లు టీజర్ ప్రారంభమవుతుంది. నేను ఒక నటుడిని అంటూ చిరంజీవి(Chiranjeevi) వాయిస్ అందర్నీ ఆకర్షిస్తోంది.
డైరెక్టర్ కృష్ణవంశీ(Krishnavamsi) తెరకెక్కిస్తోన్న సినిమా రంగమార్తాండ(Rangamaarthanda). ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ సినిమాను కాలిపు మధు, ఎస్.వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీని మార్చి 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
‘రంగమార్తాండ’ టీజర్:
ఇప్పటికే రంగమార్తాండ(Rangamaarthanda) సినిమా ప్రచార కార్యక్రమాలను మూవీ మేకర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం మూవీ టీజర్ ను విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి(Krishnavamsi) వాయిస్ తో ఈ టీజర్ మొదలవ్వగా ప్రకాష్ రాజ్ ను సన్మానిస్తున్నట్లు టీజర్ ప్రారంభమవుతుంది. నేను ఒక నటుడిని అంటూ చిరంజీవి(Chiranjeevi) వాయిస్ అందర్నీ ఆకర్షిస్తోంది.
నువ్వొక చెత్త నటుడివిరా, మనిషిగా అంతకంటే నీచుడివిరా అంటూ బ్రహ్మానందం డైలాగులు అందర్నీ ఆసక్తి రేపేలా చేస్తున్నాయి. నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని రంగమార్తాండ(Rangamaarthanda) రాఘవరావుని అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ మూవీ ప్రీమియర్ షోను వీక్షించిన వారంతా దర్శకుడు కృష్ణవంశీ(Krishnavamsi)పై ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకుడి హృదయాన్ని తాకే విధంగా సినిమాను తెరకెక్కించారంటూ విమర్శకులు సైతం పొగిడారు. ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా(Ilayaraja) సంగీతాన్ని అందించారు.