కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ నటించిన వారిసు.. తమిళ్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా.. అజిత్ ‘తునివు’ సినిమాకు పోటీగా జనవరి 11న రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ అందుకుంది. అయితే తెలుగులో జనవరి 13న రిలీజ్ అయిన వారసుడు పెద్దగా సౌండ్ చేయలేదు. అయినా మంచి కలెక్షన్లే రాబడుతున్నాడట. ఇదిలా ఉంటే.. వారసుడు సినిమాలో 10 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఎపిసోడ్ ని తీసేశారట. ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ, విజయ్, రష్మిక మందన్న కాంబినేషన్లో 20 నిమిషాల ఎపిసోడ్‌ని షూట్ చేశారట. దీని కోసం 10 కోట్ల వరకు ఖర్చయ్యాయట.
విజయ్ సినిమా కావడంతో దిల్ రాజు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవలేదు. సినిమా చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుంది. చాలా గ్రాండియర్‌గా ఈ సినిమాను నిర్మించారు. ఖుష్బూ ఎపిసోడ్ కోసం భారీ ఖర్చు చేశారట. ఆమెకు పారితోషికం కూడా భారీగానే ఇచ్చారట. అయితే ఏమైందో ఏమో గానీ.. ఫైనల్ కట్లో ఖుష్బూ సీన్స్‌ను లేపేశారు. 10 కోట్లు ఖర్చు పెట్టి మరీ తీసిన ఖుష్బూ సీన్స్‌ను ఎందుకు తీసేశారనేది దిల్ రాజుకే తెలియాలి. డబ్బుల విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉండే దిల్ రాజు కూడా 10 కోట్లు వేస్ట్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇదే కాదు.. ఈ సినిమా బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అయిందని టాక్. విజయ్ పారితోషికమే 100 కోట్లని అంటున్నారు. ఈ లెక్కన దిల్ రాజు.. విజయ్ కోసం గట్టిగానే ఖర్చు చేశారని చెప్పొచ్చు.