Sree leela: టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా శ్రీలీల పేరు వినిపిస్తోంది. అన్ని సినిమాల్లో హీరోలు తమ సరసన శ్రీలీలే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె చేతిలో పది సినిమాలు ఉన్నాయి. ఆమె కోసం ఇద్దరూ డెబ్యూ హీరోలు సైతం పోటీ పడుతున్నారట. వారెవరో కాదు, బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ, మరొకరు ఎన్టీఆర్ బావ మరిది నితిన్.
మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన అమెరికాలో యాక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. వచ్చే ఏడాది మొదటి సినిమా లాంచింగ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. డైరెక్టర్ సంగతి పక్కన పెడితే, హీరోయిన్గా మాత్రం శ్రీలీలను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.
బాలయ్య హీరో గా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ చిత్రంలో హీరోకి కూతురిగా నటిస్తుంది. ఆ మూవీ సమయంలో బాలయ్యకి శ్రీలీల తెగ నచ్చేసిందట. పెద్దల పట్ల శ్రీలీలకి ఉన్న గౌరవం, ఆమెలోని చాలాకితనం నచ్చిందట. ఆమెను కన్ఫామ్ చేశారని తెలుస్తోంది. మరో వైపు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి బ్రదర్ నితిన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాను పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే తన నెక్ట్స్ మూవీ కోసం.. భారీ ప్లాన్ వేశాడు. నితిన్ సైన్ చేసిన సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉంటుందని సమాచారం. అది కూడా భారీ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తారట.