TG: సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. నిన్న థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఒక బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. సంధ్య థియేటర్ మూసివేతకు సిఫారసు చేశామని పేర్కొన్నారు.