ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన బిడ్డకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘తల్లి డ్యూటీ చేస్తూ.. ఎన్నో కోరికలను కోరుతూ 2024వ సంవత్సరాన్ని ముగిస్తున్నాం. తనకి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాను’ అంటూ తన భర్తను ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది. ఇక అక్షర తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటించింది. తెలుగులో మాస్ కా దమ్కీ, హరోం హర వంటి సినిమాలు చేసింది.