బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై వాళ్లెప్పుడూ నేరుగా స్పందించలేదు. రీసెంట్గా ఈ జంట ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. మ్యాచింగ్ డ్రెస్సుల్లో ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అంతేకాక.. ఐశ్వర్య తల్లి బృంద్య, అను రంజన్‌తో కలిసి ఈ కపుల్ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వారి విడాకుల రూమర్స్‌కి చెక్ పడినట్లైంది.