నటి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ మూవీకి ‘ఓ సుకుమారి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి డైరెక్టర్ భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.