మంచిర్యాల్లో బుధవారం జరిగిన అస్మిత ఖేలో ఇండియా జోనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో నిర్మల్ KGBV అర్బన్ సోఫీ నగర్ విద్యార్థినులు మెరిశారు. 50 కేజీ అండర్- 17లో నికిత స్వర్ణం, 55 కేజీలో సుజల రజతం, 46 కేజీలో సాహితి రజత పతకం దక్కించుకున్నారు. 41 కేజీ విభాగంలో హరిప్రియ కరాటే ఈవెంట్లో రజతం సాధించింది. విజేతలను స్పెషల్ ఆఫీసర్ సుజాత, PET సుమలతలు అభినందించారు.
Tags :