NRML: హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించేది లేదని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి హిందూ దేవుళ్లను కించపరిచారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు.