TG: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. స్వరాష్ట్ర ఉద్యమాన్ని మలుపుతిప్పిన కీలక ఘట్టాల్లో కాసోజు శ్రీకాంతాచారి ఆత్మార్పణం ఒకటి అని తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడానికి తన శరీరాన్ని ఒక సమిధలా చేసి ఆత్మార్పణం చేసిన త్యాగం.. చరిత్రలో నిలిచిపోతుందన్నారు.