WGL: వర్ధన్నపేట మండలం గుబ్బెటితండా గ్రామంలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుడైన సపవాట్ బాలు (52) ఇంటి ఎదుట చెట్టుకు కరెంట్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన బాలు చికిత్స ఖర్చులు, అప్పుల భారం కారణంగా మనస్థాపానికి గురై ఈ అడుగు వేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.