సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యంగ దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు, జిల్లా యువజన అధికారి కాసిం బేగ్ పాల్గొన్నారు.