ATP: రాయదుర్గం మండలం ఆయతపల్లి గ్రామంలో బుధవారం ఆంజనేయ స్వామి రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి రథోత్సవ వేడుకల్లో పాల్గొని, రథాన్ని లాగి మొక్కలు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంజన్న నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి.