ఆరావళి పర్వతాల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సోనియా గాంధీ మండిపడ్డారు. 100 మీటర్ల లోపు కొండల్లో మైనింగ్‌కు పర్మిషన్ ఇవ్వడం అంటే.. ఆరావళికి ‘డెత్ వారెంట్’ ఇవ్వడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మైనింగ్ మాఫియాకు రెడ్ కార్పెట్ వేయడమేనని, వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.