MDK: రామాయంపేట మండల కేంద్రంలో అమరుడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తా వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఆశయ సాధన కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి సేవలు, ఆయన త్యాగం మరువలేనివని నాయకులు కొనియాడారు.