కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌కు చెందిన మెతుకు హేమలత పటేల్ దశాబ్దకాలంగా కరీంనగర్ కోర్టులో అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు. ఈమె న్యాయవాద వృత్తితోపాటు మహిళలు, పిల్లలకు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థిగానూ పోటీ చేసిన హేమలత.. ఇప్పుడు నగునూర్ సర్పంచ్‌గా బరిలోకి దిగారు. నగనూరులో ఆసక్తికరంగా రాజకీయం రసవత్తరమైంది.