NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 16 వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం బలోపేతానికి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకుని అమరుడు అయ్యాడని గుర్తు చేసుకున్నారు.