దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల సేవలు నిలిచిపోయాయి. విమానాశ్రయాలకే విమానాలు పరిమితం కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు నిన్న రాత్రి నుంచి ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్ సమస్య కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు సమాచారం.