PLD: జిల్లాలో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి వణికిస్తోంది. ఈ లక్షణాలతో ఇద్దరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్ళ(M) రుద్రవరానికి చెందిన జ్యోతి(20), రాజుపాలెం(M)కి చెందిన నాగమ్మ(62) తీవ్ర జ్వరం, ఒంటినొప్పులతో ఆసుపత్రిలో చేరి మృతి చెందారు. రక్త పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ లక్షణాలున్నట్లు తేలింది. కొత్తూరులో మరో వృద్ధురాలు చికిత్స పొందుతున్నారు.