TG: ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోరు పెంచారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఈనెల 8, 9 తేదీల్లో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ముఖ్య అతిథిగా రావాలని ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రధానితో భేటీకి ముందు ఈ సమావేశం జరిగింది.