TG: హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ యువ, మహిళా మోర్చా పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు పార్టీ ఆఫీస్ దగ్గరకు భారీగా తరలొచ్చారు.