TG: పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కొన్ని గ్రామాల్లో SC, STలు లేకున్నా వారికే రిజర్వ్ చేశారని పిటిషన్లు దాఖలు చేశారు. 6 పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్.. పిటిషన్లను డివిజన్ బెంచ్‌లో ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది. పిటిషన్లకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను సమర్పించాలని, డాక్యుమెంట్లు ఇచ్చాక సీజే ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది.