గుంటూరు: కొల్లిపర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐ కోటేశ్వరరావు మంగళవారం గుంటూరు వీఆర్ఓకు బదిలీ అయ్యారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎన్. సి. ప్రసాద్ బుధవారం కొల్లిపర పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా బదిలీ అయ్యారు. దీంతో కొల్లిపర పీఎస్ సిబ్బంది నూతన ఎస్ఐకి అభినందనలు తెలిపారు.