NLG: ఉమ్మడి జిల్లాలో నేడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదటి దశ ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. వెంటనే వారికి గుర్తులను కేటాయిస్తారు. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లలో తెలుగు అక్షర క్రమంలో గుర్తుల కేటాయింపు ఉంటుందని ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు.