NLR: మాజీ మంత్రి, కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు బుధవారం కొడవలూరు పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేశారు. సెప్టెంబర్ 20న వీరిపై నమోదైన కేసులో భాగంగా కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సంతకాలు చేశారు. వీరితో పాటు స్థానిక వైసీపీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు కూడా స్టేషన్ వద్దకు వచ్చారు.