CTR: పుంగనూరు బసవరాజు ప్రభుత్వం జూనియర్ కళాశాల NSS వాలంటరీ విద్యార్థులు డ్రగ్స్‌పై అవగాహన చేపట్టారు. బుధవారం పుంగనూరు పట్టణం మంగళం కాలనీలోకి వెళ్లి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని లేనిపక్షంలో ఆరోగ్యం క్షీణిస్తుందని తెలియజేస్తూ అవగాహన కల్పించారు.