ATP: BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం ఉదయం బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన తన ఆప్తమిత్రులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆలయ అధికారులు వారికి ప్రసాదాలు అందజేశారు.