AP: కర్నూలు జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బనగానపల్లెలో పలు అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించారు. కోవెలకుంట్ల-బనగానపల్లె రహదారి పనులు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పంచాయతీ కార్యాలయం పునర్నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.