WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మైనారిటీ పాఠశాలను ఇవాళ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సాంబశివరావు సందర్శించారు. ఈ సందర్భంగా DMHO పాఠశాలలో అమలవుతున్న హెల్త్ ప్రోగ్రాం, విద్యార్థుల హైజీన్ నిర్వహణ, డైట్ మెనూ తదితర కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆహార అలవాట్లు, ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.