GNTR: తెనాలిలో మున్సిపల్ మార్కెట్ వైపు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. కాల్వకట్ట రోడ్లో మాంసం, చేపల విక్రయాల వ్యర్థాలు నాలుగు రోజులుగా రోడ్డు పక్కనే ఉంచారు. ఇక్కడ నుంచి వాటిని తరలించకపోవడంతో ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోందని ఇటుగా వెళుతున్న వారు వాపోతున్నారు. వ్యర్థాలలోనే కుక్కలు, ఆవులు సంచరిస్తున్నాయని అధికారుల స్పందించాలని ప్రజలు అంటున్నారు.