NLG: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో దామరచర్ల రాజకీయం ఆసక్తికరంగా మారింది. సర్పంచి అభ్యర్థి బంటు రేణుక ఓటర్ జాబితాలో పేరు లేకపోవడంతో, ఆమె హైకోర్టును ఆశ్రమించారు. ఆమె వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, నామినేషన్ను స్వీకరించాలని సంబంధిత ఎలక్షన్ అధికారులను ఆదేశించింది. దీంతో మంగళవారం రాత్రి ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.