తన వద్ద ఆయుధాలు లేకపోయినా ఐదేళ్లు జైలుశిక్ష అనుభవించినట్లు నటుడు సంజయ్ దత్ తెలిపాడు. తన దగ్గర తుపాకీ ఉందని అరెస్ట్ చేశారని, తన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని నిరూపించడానికి 25ఏళ్ల టైం ఎందుకు పట్టిందో అర్థం కాలేదన్నాడు. తన కేసును వేగవంతంగా పరిష్కరించాలని ఎన్నోసార్లు అభ్యర్థించినట్లు చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు మత గ్రంథాలు చదవడంతో పాటు న్యాయశాస్త్రంపై అధ్యయనం చేశానని అన్నాడు.