ADB: సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ నందు డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది.