దిత్వా తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమై ఆపదలో ఉన్న శ్రీలంకకు భారత్ మరో భారీ సాయం చేస్తోంది. అత్యవసర వైద్య సేవల కోసం ‘రాపిడ్లీ డిప్లాయబుల్ ఫీల్డ్ హాస్పిటల్’ను పంపిస్తోంది. దీనితో పాటు 70 మంది వైద్య సిబ్బంది కూడా వెళ్తున్నారు. ఈరోజు సాయంత్రానికే ఈ టీం శ్రీలంక చేరుకోనుంది. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు తక్షణ వైద్యం అందించడమే దీని ప్రధాన లక్ష్యం.