కోనసీమ: విజయవాడ వాస్తవ్యుల పెండ్యాల వెంకట సత్య రమణ మూర్తివారి కుటుంబ సభ్యులు బుధవారం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి అన్నప్రసాద ట్రస్ట్‌కు విరాళంగా రూ. 51,009 సమర్పించినారు. ముందుగా దాతలు స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి స్వామి వారి చిత్రపటం అందజేసినారు.