TPT: చంద్రగిరి పట్టణంలో గంగమ్మ జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నాలుగు గంగమ్మల ప్రతిమలు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పట్టణంలోకి ప్రవేశించాయి. మార్గమంతా భక్తులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిమంది భక్తులు జాతరను తిలకించారు.