‘పుష్ప 2’ కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ ‘ఇంటర్స్టెల్లార్’ రీ రిలీజ్ వాయిదా పడిందని వస్తోన్న విమర్శలపై నటి జాన్వీ కపూర్ స్పందించారు. ‘పుష్ప 2’కు సపోర్ట్ చేశారు. ఈ మూవీ కూడా సినిమానే కదా.. ఎందుకు మరొకదానితో దీన్ని పోలుస్తూ తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు. ‘హాలీవుడ్ వాళ్లే మన మూవీలను ప్రశంసిస్తుంటే.. మనం మాత్రం మన మూవీలను తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం. ఇలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది’ అని తెలిపారు.