Meenakshi Chaudhary: కండీషన్స్ అప్లై.. అలాంటి పని చేయను!
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో చేరడానికి మంచి ఛాన్స్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి సెలక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేస్తున్నాను.. అలాంటి వాటికి దూరంగా ఉంటానని బల్లగుద్ది మరి చెబుతోంది ఈ క్యూట్ బ్యూటీ.
సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో నటించే ఛాన్స్ కొట్టేసింది. కానీ ఖిలాడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేయడంతో.. మీనాక్షికి నిరాశ తప్పలేదు. అయితే అడివిశేష్‌తో కలిసి నటించిన ‘హిట్ 2’ సినిమాతో మాత్రం మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హిట్ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మీనాక్షికి ఆఫర్లు మరింత పెరిగాయి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ అందుకుంది.
ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో.. మీనాక్షి బంపర్ ఆఫర్ కొట్టేసింది. అలాగే విశ్వక్ సేన్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. అయినా కూడా సినిమాల ఎంపిక విషయంలో మాత్రం చాలా సెలక్టివ్‌గా ఉంటోంది అమ్మడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ అండ్ సినిమా కథల ఎంపిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మీనాక్షి. కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి అవకాశాలు రావడం సంతోషంగా ఉందని చెప్పింది. అయితే తాను ఈ మధ్య చాలా కాథలు విన్నానని.. కానీ కథల ఎంపికలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు చెప్పింది.
తక్కువ సినిమాలు చేసినా కూడా, అవి కెరీర్లో గుర్తుండిపోవాలి. అందుకే కథాంశాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా. అవకాశాల కోసం కాకుండా ప్రేక్షకులను మెప్పించి వారిక గుర్తుండిపోయే పాత్రలే చేస్తానని చెప్పుకొచ్చింది. అలాగే లిప్ సీన్స్‌లో నటించకూడదని ఫిక్స్ అయ్యానని చెప్పింది. తనకు ఏదైనా సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తే వద్దంటానని.. అందుకే చాలా ఆఫర్లు వదులుకున్నానని అంది. ముద్దు కోసమే ఆ సీన్ రాస్తే చేయనని.. కానీ సీన్ డిమాండ్ చేస్తే మాత్రం చేస్తానని క్లారిటీ ఇచ్చింది. మరి కండీషన్స్ అప్లై అంటున్న మీనాక్షి కెరీర్ పరంగా ఎలా రానిస్తుందో చూడాలి.