అసలు మెగాస్టార్ ఫ్యాన్స్‌కు కావాల్సింది ఏంటి? చిరు వింటేజ్ లుక్, మెగాస్టార్ స్టైల్ ఆఫ్ కామెడీ, అదిరిపోయే యాక్షన్, దానికి తోడు ఎమోషనల్ టచ్, గూస్ బంప్స్ ఎలివేషన్స్.. సినిమాలో జస్ట్ ఇవి ఉంటే చాలు.. మిగతా కంటెంట్ పెద్దగా అక్కర్లేదు. ఇదే ఫార్ములాతో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. అది కూడా రీమేక్‌లే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో మెగా రీమేక్ హాట్ టాపిక్‌గా మారింది.
Chiru: రీ ఎంట్రీ తర్వాత చిరు చేసిన సినిమాల్లో మూడు రీమేకులే ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్ తర్వాత ఇప్పుడు భోళా శంకర్‌గా వస్తున్నాడు. మరో వారం రోజుల్లో భోళా శంకర్ సినిమా థియేటర్లోకి రాబోతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఆగష్టు 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. వచ్చే ఆదివారం హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని తెలిసింది.
ఈ మూవీ తర్వాత చిరు చేయబోయే ప్రాజెక్ట్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మించబోతున్నారు. ఈ మూవీ మెగాస్టార్ మార్క్ హిలేరియస్‌గా ఎంటర్టైనర్గా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్నా? లేదంటే స్ట్రెయిట్ మూవీనా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ముందు నుంచి ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ ‘బ్రో డాడీ’ రీమేక్‌గా రానుందని ప్రచారం జరుగుతోంది. తెలుగు నెటీవిటికి తగ్గట్టుగా కథను మార్చి ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారని అంటున్నారు. అలాగే మెగాస్టార్ కొడుకుగా సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఫైనలైజ్ అవలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను తండ్రి కొడుకుల కథగా కాకుండా.. అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
బ్రో డాడీ కథ ప్రకారం.. చిరుని తండ్రిగా చూపించకుండా అన్నయ్యగా చూపించబోతున్నారట. దీంతో ఇది మరో మెగా రీమేక్ అని ఫిక్స్ అవుతున్నారు అభిమానులు. ఇదే జరిగితే.. చిరు ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదనే చెప్పాలి. మిగతా స్టార్ హీరోలంతా స్ట్రెయిట్ సినిమాలు చేస్తుంటే.. చిరు, పవన్ మాత్రం రీమేక్‌లతో నెట్టుకొస్తున్నారు. ఇదే మెగా ఫ్యాన్స్‌ను తెగ డిసప్పాయింట్ చేస్తోంది. మరి చిరు కొత్త ప్రాజెక్ట్ రీమేక్నా, కాదా.. అనే క్లారిటీ రావాలంటే ఆగష్టు 22వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.