Rakesh Master Son: మమ్మల్ని అల్లరిపాలు చేయొద్దు..వారిపై రాకేష్ మాస్టర్ కొడుకు ఫైర్
రాకేష్ మాస్టర్ తనయుడు చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని యూట్యూబ్ ఛానెల్స్ తమ స్వార్థానికి వాడుకున్నాయని, ఇకనైనా తన కుటుంబాన్ని, తనను అల్లరి పాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ కష్టాల గురించి వీడియోలు తీసి, తమను ఇబ్బందుల పాలు చేయొద్దని తెలిపాడు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్(Rakesh Master) జూన్ 18న మరణించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో రాకేష్ మాస్టర్ చాలా సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన యూట్యూబ్‌లో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ, సినీ ప్రముఖులపై, రాజకీయ నేతలపై వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ మాట్లాడే ప్రతి మాటా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.’
ఒకప్పుడు సినిమాలు, షోలతో బిజీగా ఉండే రాకేష్ మాస్టర్(Rakesh Master) కొన్నాళ్ల క్రితం మానసికంగా దెబ్బతిన్నారు. మందుకి అలవాటు పడ్డారు. ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారు. వాటిని ఆసరాగా తీసుకుని కొన్ని యూట్యూబ్ ఛానల్స్(Youtube Channels) ఆయన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాయి. దీంతో రాకేష్ మాస్టర్ చాలా వైరల్ అయ్యారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ఇంటర్వ్యూలు విపరీతంగా వైరల్(Viral) అవుతున్నాయి.
తాజాగా రాకేష్ మాస్టర్(Rakesh Master) తనయుడు చరణ్ తేజ్(Charan Tej) మీడియాతో మాట్లాడారు. రాకేష్ మాస్టర్ మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని, కొడుకుని ఇంటర్వ్యూ చేసేందుకు పలు యూట్యూబ్ ఛానళ్లు(Youtube Channels) ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన వద్దకు వచ్చిన పలు ఛానల్స్ వాళ్లపై చరణ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చరణ్ తేజ్(Charan Tej) మాట్లాడుతూ రాకేష్ మాస్టర్(Rakesh Master) అలా అవ్వడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అని, కొంత మంది తమ యూట్యూబ్ ఛానల్స్ పబ్లిసిటీ కోసం, డబ్బులు సంపాదించడం కోసం ఆయన్ని నెగిటివ్ గా చూపించారని ఫైర్ అయ్యాడు. ఇకనైనా ఆ వీడియోలు ప్రసారం చేయడం ఆపాలని కోరాడు. ఇప్పటి వరకూ తమ కుటుంబాన్ని అల్లరి పాలు చేసింది చాలని, తమ కష్టాల గురించి ఇక వీడియో చేయొద్దని, తమ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయొద్దని కోరాడు. ఇకపై ఎవరైనా తమపై తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.