ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah bhatia) తన భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి కీలక విషయాలను తెలిపింది. వారి డేటింగ్ గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు వారి ప్రేమ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah bhatia). ఆమె గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె విజయ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. విజయ్(vijay) తో కలిసి ఆమె చాలాసార్లు మీడియాకు చిక్కింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో వారిద్దరూ లిప్ లాక్ చేసుకుంటున్న వీడియో కూడా బయటకు వచ్చింది. కాగా, ఇటీవల అతనితో తనకు ఉన్న రిలేషన్ ని ఆమె కన్ఫామ్ చేశారు. తాను విజయ్ తో రిలేషన్ లో ఉన్నానని క్లారిటీ ఇవ్వడం విశేషం. తమకు లస్టో స్టోరీస్ 2 సెట్స్ లోనే పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమకు దారితీసిందని తమన్నా చెప్పడం విశేషం. కేవలం ప్రేమలో ఉన్నామని అంగీకరించడమే కాకుండా, విజయ్ గురించి ఆమె చాలా గొప్పగా చెప్పడం విశేషం. కాగా, తాను విజయ్ తో ప్రేమలో పడటానికి గల కారణాన్ని కూడా ఆమె తాజాగా వివరించారు.
ఇప్పటి వరకు మరొక యాక్టర్ పక్కన తాను ఇంత సేఫ్(safe)గా ఎప్పుడూ ఫీల్ కాలేదని తెలిపింది. ఎవరైనా సరే కోస్టార్ నుంచి అలాంటి సేఫ్టీ ఫీలింగ్ పొందడం ముఖ్యమని అభిప్రాయపడింది. ‘ప్రత్యేకించి ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ టైమ్‌లో విజయ్ మొదటి క్షణం నుంచే అలాంటి ఫీలింగ్ కల్పించాడని తెలిపింది. దీనివల్ల సీన్ తీస్తున్నపుడు ఏదైనా చెప్పేందుకు లేదా చేసేందుకు నేను భయపడలేదు. నేను తనను లవ్ చేసేందుకు ఇది కూడా ఒక కారణం’ అని చెప్పుకొచ్చింది. ఇక తమన్నా గురించి విజయ్ చెప్తూ.. తను చాలా సింపుల్ అన్నాడు.
‘కొన్నేళ్లుగా డిఫరెంట్ అండ్ పవర్ఫుల్ రోల్స్‌తో మెప్పిస్తున్న ఇలాంటి ఒక నటుడితో కలిసి పనిచేసే అవకాశం తప్పకుండా వస్తుందని అనుకున్నాను. పాత్రకు తగ్గట్లుగా విజయ్ తనను తాను మౌల్డ్ చేసుకోవడంలో ఊసరవెల్లిని తలపిస్తాడు. ఇక విజయ్(vijay) గత చిత్రాలు కూడా చూశాను. నిజం చెప్పాలంటే.. ఏం చేయకపోయినా సరే విజయ్, డైరెక్టర్ సుజోయ్ ఘోష్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను. అలాగే ఈ ప్రాజెక్ట్‌ను నిజాయితీగా చేయాలనుకున్నాను’ అని పంచుకుంది తమన్నా.