»Rashmika Released A Note On The Managers Fraud News
Rasmika Mandanna: మేనేజర్ మోసం వార్తలపై నోట్ రిలీజ్ చేసిన రష్మిక
హీరోయిన్ రష్మికను తన మేనేజర్ మోసం చేసి రూ.80 లక్షలు కాజేసినట్లు వస్తున్న వార్తలపై రష్మిక స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అసత్యమని, వాటిని నమ్మొద్దని తెలిపారు.
టాలీవుడ్(Tollywood) హీరోయిన్ రష్మిక(Rasmika Mandanna)ను తన వ్యక్తిగత మేనేజర్(Manager) మోసం చేశారని వార్తలు వైరల్(Viral) అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై రష్మిక మందన్న స్పందించారు. తనకు తన మేనేజర్‌కు మధ్య ఎలాంటి శతృత్వం లేదని స్పష్టం చేశారు. తామిద్దరం కెరీర్లో ఎవరికి వారు ఎదగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోయినట్లు తెలిపారు.
తను, తన మేనేజర్(Manager) ఇద్దరం ప్రొఫెషనల్స్ అని, ఎక్కడైనా తాము తమ పనికి కట్టుబడి ఉంటామని రష్మిక(Rasmika Mandanna) అన్నారు. మేనేజర్ ఆర్థికం(Financially)గా మోసం చేశారని, తనకు తెలియకుండా రూ.80 లక్షలు కాజేశాడని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తానే తన మేనేజర్ ను తొలగిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రష్మిక పుష్ఫ2(Pushpa2 Movie) సినిమాలో నటిస్తున్నారు.