»Super Talented Actress Keerthy Suresh Picked For Naga Chaitanya
Naga chaitanya: చైతూ సరసన కీర్తి..మహానటి కాంబినేషన్..!
అక్కినేని వారసుడు నాగ చైతన్య(naga chaitanya)కి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరుసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు.
ప్రస్తుతం చైతూ(naga chaitanya) గతంలో తనతో ప్రేమమ్, సవ్యసాచి వంటి చిత్రాలను రూపొందించిన కార్తికేయ2 దర్శకుడు చందూ మొండేటితో జతకడుతున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొదట గీతా ఆర్ట్స్ నాగ చైతన్యతో సినిమా చేయాలని అనుకుందట. అయితే కథ కూడా సిద్ధం చేశారట. అయితే అలాంటి కథను చందూ మాత్రమే సరిగ్గా హ్యాండిల్ చేయగలడని చైతూ నమ్మాడట. అందుకే అతను తన సినిమాని డైరెక్ట్ చేయాలని చైతన్య పట్టుపట్టి ఒప్పించినట్లు తెలుస్తోంది. నాగచైతన్య కంటే ముుందు చందూ మొండేటి తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా చేయాలని భావించాడు. దానికి కూడా గీతా ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ కూడా నాగ చైతన్య సినిమా డైరెక్ట్ చేయమని కోరడంతో ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ కోరడంతో చందూ ఈ సినిమాకి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం.
కాగా మొదట ఈ మూవీలో అనుపమని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి కీర్తి సురేష్(keerthy suresh) వచ్చింది. ప్రస్తుతం కీర్తి మంచి హిట్ ల మీద ఉంది. ఆమె అయితే బాగుటుందని భావించి కీర్తిని కన్ఫామ్ చేసినట్లు సమాచారం. కాగా గతంలో వీరిద్దరూ మహానటి సినిమాలో నాగేశ్వరరావు, సావిత్రిలుగా కనిపించారు. వీరి కాంబినేషన్ బాగుందని అప్పట్లోనే అందరూ భావించారు. తాజాగా మరోసారి పూర్తి స్థాయి సినిమా కోసం జతకడుతున్నట్లు సమాచారం. మరోవైపు, కార్తికేయ2 వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన తర్వాత చందూ మొండేటి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఈ సినిమాని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారట. కాబట్టి గీతాఆర్ట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందించనుంది.